Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 76

Parasurama- 3 !!

||om tat sat ||

బాలకాండ
డెబ్బది ఆఱవ సర్గ

శ్రుత్వా చ జామదగ్న్యస్య వాక్యం దాశారథిస్తదా |
గౌరవాద్యంత్రిత కథః పితూరామమ్ అథాబ్రవీత్ ||

స|| పితూ గౌరవాద్యత్రిత రామమ్ దాశరథిః తదా జామదగ్న్యస్య వాక్యం శ్రుత్వా అథ అబ్రవీత్ ||

తా|| తండ్రిమీదగౌరవముతో మిన్నకున్నరాముడు జమదగ్ని యొక్క పుత్రుని మాటలను విని ఇట్లు పలికెను.

శ్రుతవానస్మి యత్కర్మ కృతవానపి భార్గవ |
అనురుంధ్యామహే బ్రహ్మన్ పితురానృణ్యమాస్థితః||

స|| హే బ్రహ్మన్ !హే భార్గవ ! పితురానృణ్యమాస్థితః అనురుంధ్యామహే యత్కర్మ కృతవాన్ అపి శ్రుతవానస్మి |

తా|| "ఓ బ్రహ్మన్ ! ఓ భార్గవ ! పిత్రు ఋణము తీర్చుకొనుటకు చేసిన కార్యము గురించి వింటిని . దానికి నా అభినందనలు."

వీర్యహీనమివాశక్తం క్షత్రధర్మేణ భార్గవ |
అవజానాసి మేతేజః పశ్య మేsద్య పరాక్రమమ్ ||

తా|| హే భార్గవ ! వీర్యహీనం అశక్తం ఇవ మే తేజః అవజానాసి | అద్య మే పరాక్రమమ్ పశ్య ||
తా|| "ఓ భార్గవ ! వీర్యహీనుడని అశక్తుడని అని నా పరాక్రమమును అవమానించితివి. ఇప్పుడు నాపరాక్రమము చూడుము".

ఇత్యుక్త్వా రాఘవః కృద్ధో భార్గవస్య శరాసనమ్ |
శరం చ ప్రతిజగ్రాహ హస్తాల్లఘుపరాక్రమః ||

స|| ఇతి ఉక్త్వా క్రుద్ధో రామః లఘు పరాక్రమః భార్గవస్య శరాసనమ్ శరం చ హస్తాత్ ప్రతిజగ్రాహ ||

తా|| అని చెప్పి పరాక్రమవంతుడైన రాముడు పరశురాముని ధనస్సును అతని చేతులనుంచి అవలీలగా గ్రహించెను.

ఆరోప్య సధనూ రామః శరం సజ్యం చకార హ |
జామదగ్న్యం తతో రామం రామః క్రుద్ధోsబ్రవీ ద్వచః ||

స|| రామః శరం సజ్యం చకార స ధనూ ఆరోప్య తతః రామః క్రుద్ధః జామదగ్న్యం రామం అథ అబ్రవీత్ ||

తా|| ధనస్సుతో బాణమును సంధించి పిమ్మట క్రుద్ధుడైన రాముడు జమదగ్ని కుమారుడు అగు పరశురామునితో ఇట్లు పలికెను.

బ్రాహ్మణోsసీతి పూజ్యో మే విశ్వామిత్రకృతేన చ |
తస్మాచ్ఛక్తో న తే రామ మోక్తుం ప్రాణహరం శరమ్||

స|| బ్రాహణః అసి విశ్వామిత్రకృతేన చ ఇతి మే పూజ్యః | హే రామ తస్మాత్ ప్రాణహరం మోక్తుమ్ న శక్తః ||

తా|| "బ్రాహ్మణుడవు విశ్వామిత్రునితో సంబంధముగలవాడవు అందువలన నాకు పూజ్యుడవు. ఓ పరశురామ ! అందువలన ప్రాణము తీయుటకు అశక్తుడను."

ఇమాం పాదగతిం రామ తపోబలసమార్జితాన్ |
లోకానప్రతిమాన్ వాతే హనిష్యామి యదిఛ్చసి ||

స|| ఇమాం పాదగతిం వా తపోబలసమన్వితాన్ అప్రతిమాన్ లోకాన్ యదిఛ్చసి తే హనిష్యామి ||

తా|| "ఈ పాదగతిని కాని తపోబలముతో అర్జించిన పుణ్యలోకములను కాని నీ కోరికప్రకారము నశింపచేసెదను" .

న హ్యయం వైషణవో దివ్యః శరః పరపురంజయః |
మోఘః పతతి వీర్యేణ బలదర్ప వినాశనః ||

స|| అయం వైష్ణవః దివ్యః పరపురంజయః శరః వీర్యేణ బలదర్ప వినాశనః మోఘః న పతతి||

తా|| "ఇది వైష్ణవ బాణము. దివ్యమైనది. శత్రుపురములను నాశనము చేయగలది. వీరులబలదర్పములను అణచేయునది. వ్యర్థముగా పడదు".

వరాయుధధరం రామం ద్రష్టుం సర్షిగణాస్సురాః |
పితామహం పురస్కృత్య సమేతాస్తత్ర సంఘశః ||
గంధర్వాప్సరసశ్చైవ సిద్ధచారణ కిన్నరాః |
యక్షరాక్షసనాగాశ్చ తద్రష్టుం మహదద్భుతమ్||

స|| రామంవరాయుధ ధరం ద్రష్టుం పితామహం పురస్కృత్య సురాః స ఋషిగణాః సంఘశః తత్ర సమేతాః | సిద్ధచారణ కిన్నరాః గంధర్వ అప్శరసశ్చ ఏవ యక్షరాక్షస పన్నగాః చ తత్ మహత్ అద్భుతమ్ ద్రష్టుం (సమేతాః) ||

తా|| శ్రేష్ఠమైన అయుధములు ధరించిన రాముని చూచుటకు ఋషిగణములతో కూడిన సురలు బ్రహ్మదేవుని అనుసరించి అచట కూడిరి. గందర్వులు అప్సరసలు సిద్ధ చారణ కిన్నరులు యక్షులు రాక్షసులు నాగులు కూడా ఆ అద్భుతమైన దృశ్యము చూచుటకు వచ్చిరి.

జడీకృతే తదా లోకే రామే రామే వరధనుర్ధరే |
నిర్వీర్యో జామదగ్న్యోsసౌ రామో రామముదైక్షత ||

స|| రామే వర ధనుర్ధరే తదా లోకే జడీకృతే | అసౌ రామః జామదగ్న్యః నిర్వీర్యః రామం ఉదైక్షత ||

తా|| శ్రేష్ఠమైన ధనస్సు ధరించిన రాముని చే లోకము స్తబ్ధము ఆయెను. ఆ పరశురాముడు తన వీరత్వము కోల్పోయి రాముని చూచెను.

తేజోభిహతవీర్యత్వాత్ జామదగ్న్యో జడీకృతః |
రామం కమలపత్రాక్షం మందం మందమువాచహ ||

స|| వీర్యత్వాత్ జడీకృతః తేజోభిహతః రామం కమలపత్రాక్షం మందం మందమువాచ హ ||

తా|| పరాక్రమము సన్నగిల్లి పోగా , తేజస్సు కోల్పోయినవాడై కమలపత్రాక్షుడైన రామునితో ( పరశురాముడు) ఇట్లు మెల్లిగా మెల్లిగా పలికెను.

కాశ్యపాయ మయాదత్త్వా యదా పూర్వం వసుంధరా|
విషయే మే న వస్తవ్యం ఇతి మాం కాశ్యపోsబ్రవీత్ ||

స|| పూర్వం మయా వసుంధరా కాశ్యపాయ దత్వా మాం కాశ్యపః మే విషయే న వస్తవ్యం ఇతి అబ్రవీత్ ||

తా|| "పూర్వము నాచేత భూమండలమంతుయూ కాశ్యపునికి ఇచ్చినప్పుడు కాశ్యపుడు నన్ను అచట ఉండతగదు అని చెప్పెను".

సోsహంగురువచః కుర్వన్ పృథివ్యాం న వసే నిశామ్ |
కృతా ప్రతిజ్ఞా కాకుత్‍స్థ కృతా భూః కాశ్యపస్య హి||

స|| సోsహం గురువచః కుర్వన్ పృథివ్యాం న వసే | హే కాకుత్‍స్థ కృతా ప్రతిజ్ఞా కాశ్యపస్య భూః నిశామ్ ||

తా|| ఆందువలన గురువచనములు పాటించుటకు నేను పృథివీమండలములో నివశించలేదు. ఓ కకుత్‍స్థ ! కాశ్యపుని భూమిలో ఉండనని ప్రతిజ్ఞపూనితిని.

తదిమాం త్వం గతిం వీర హంతుం నార్హసి రాఘవ |
మనోజవం గమిష్యామి మహేంద్రం పర్వతోత్తమమ్ ||

స|| హే రాఘవ హే వీర తత్ ఇమాం గతిం హంతుం న అర్హసి | మహేంద్రం పర్వతోత్తమమ్ మనోజవం గమిష్యామి ||

తా|| " ఓ రాఘవ ! ఓ వీరా ! ఈ పాదగతిని నశింపచేయకుము. మహేంద్రపర్వతమునకు మనోవేగముతో పోయెదను".

లోకాస్త్వప్రతిమా రామ నిర్జితాస్తపసా మయా |
జహి తాన్ శరముఖ్యేన మాభూత్ కాలపర్యయః ||

స|| హే రామ మయా లోకాత్ అప్రతిమా తపసా తాన్ శరముఖ్యాన్ జహి నిర్జితా | మాభూత్ కాలపర్యయః ||

తా|| " ఓ రామా ! అసమాన్యమైన తపస్సుతో నేను సంపాదించిన లోకములను నీ శరముతో నశింపచేయుము. ఆలస్యము వలదు".

అక్షయం మధుహర్తారం జానామి త్వాం సురేశ్వరమ్ |
ధనుష్యోsస్య పరమర్శాత్ స్వస్తి తేsస్తు పరంతప ||

స|| హే పరంతప ! అస్య ధనుషస్య పరామర్శాత్ త్వాం అక్షయం మధు హర్తారం సురేశ్వరం జానామి ||

తా|| "ఓ పరంతప ! ఈ ధనస్సు యొక్క పరామర్శతో నీవు మధును చంపిన సురేశ్వరుడవని గ్రహించుచున్నాను".

ఏతే సురగణాస్సర్వే నిరీక్షంతే సమాగతాః |
త్వామప్రతికర్మాణమ్ అప్రతిద్వంద్వమాహవే ||

స|| ఏతే సర్వే సురగణాః సమాగతాః త్వాం అప్రతికర్మాణమ్ అప్రతిద్వంద్వమాహవే నిరీక్షంతే ||

తా|| "ఈ సురగణములన్నీ అసహాయశూరుడవగు అద్భుతకర్మలను చేయగలవాడవు అగు నిన్ను చూచుచున్నారు ".

న చేయం మమకాకుత్‍స్థ వ్రీడా భవితుమర్హతి |
త్వయా త్రైలోక్యనాథేన యదహం విముఖీకృతః ||

సా|| హే కాకుత్‍స్థ ! త్వయా త్రైలోక్యనాథేన యత్ అహం విముఖీ కృతః అయం మమ న వ్రీడా భవితుం అర్హతి ||

తా|| "ఓ కాకుత్‍స్థ ! త్రైలోక నాయకుడవైన నీచేత ఓటమిపొందుట నాకు సిగ్గుపడ వలసిన విషయము కాదు".

శరమప్రతిమం రామ మోక్తుమర్హసి సువ్రత |
శరమోక్షే గమిష్యామి మహేంద్రమ్ పర్వతోత్తమమ్ ||

స|| హే రామ ! హే సువ్రత ! అప్రతిమం శరం మోక్తుం అర్హసి | శరమోక్షే పర్వతోత్తమమ్ మహేంద్రం గమిష్యామి ||

తా|| "ఓ రామ ! ఓ మంచివ్రతములను చేసినవాడా ! తిరుగులేని నీ బాణము ప్రయోగింపుము. శరమోక్షముతో నేను మహేంద్రగిరి పోయెదను".

తదాబ్రువతి రామేతు జామదగ్న్యే ప్రతాపవాన్ |
రామో దాశరథిః శ్రీమాన్ చిక్షేప శరముత్తమమ్ ||

స|| తదా ప్రతాపవాన్ జామదగ్న్యే రామే బ్రువతి తదా శ్రీమాన్ దాశరథిః రామో ఉత్తమమ్ శరం చిక్షేప ||

తా|| అప్పుడు పరశురాముడు రామునితో అట్లు పలికినప్పుడు మిక్కిలి ప్రతాపముగల శ్రీమంతుడు అగు దాశరథి ఉత్తమమైన శరమును ప్రయోగించెను.

స హతాన్ దృశ్య రామేణ స్వాన్ లోకాంస్తపసార్జితాన్ |
జామదగ్న్యో జగామాశు మహేంద్రం పర్వతోత్తమమ్ ||

స|| రామేణ స్వాన్ తపసార్జితాన్ లోకాం హతాన్ దృశ్య స జామద్గ్న్యః పర్వతోత్తమం మహేంద్రం జగామాశు||

తా|| రామునిచే తన తపస్సుతో ఆర్జింపబడిన లోకములు నశింపచేయబడగా , ( పరశురాముడు) పర్వతోత్తమమైన మహేంద్ర పర్వతమునకు వెళ్ళెను.

తతో వితిమిరాస్సర్వే దిశశ్చోపదిశస్తథా|
సురాః సర్షిగణా రామం ప్రశశంసురుదాయుధమ్ ||

స|| తతః దిశశ్చ ఉపదిశశ్చ సర్వే వితిమిరాః | సురాః స ఋషిగణాః ఉదాయుథం రామం ప్రశశంసుః ||

తా|| అప్పుడు అన్ని దిశలలోను చీకట్లు పోయెను. సురలు ఋషిగణములూ ఆయుధములు ధరించియున్న రాముని ప్రశంసించిరి.

రామం దాశరథిం రామో జామదగ్న్యః ప్రశస్య చ |
తతః ప్రదక్షిణమ్ కృత్వా జగామాత్మగతిం ప్రభుః ||

స|| రామః జామదగ్న్యః దాశరథిం రామం ప్రశస్య ప్రదక్షిణం కృత్వా ప్రభుః ఆత్మగతిం జగామ ||

తా|| పరశురాముడు దశరథరాముని ప్రశంసించి ప్రభువునకు ప్రదక్షిణము చేసి తన త్రోవన పోయెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే షట్సప్తతిమస్సర్గః ||

ఈ విథముగా బాలకాండలో దెబ్బది ఆరవ సర్గము సమాప్తము.

|| ఓమ్ తత్ సత్ ||

||Om tat sat ||